చీప్ కామెంట్ చేసిన నెటిజన్ కు రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు రిప్లై!

  • రకుల్ కారు దిగుతున్న ఫోటోను పోస్ట్ చేసిన నెటిజన్
  • 'సెషన్' తరువాత ప్యాంట్ మరచిపోయిందని వ్యాఖ్య
  • మీ తల్లిని వివరాలు అడగాలంటూ క్లాస్ పీకిన రకుల్
కారులో నుంచి తాను దిగుతున్న ఫోటోను పోస్టు చేస్తూ, చీప్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు ఘాటుగా సమాధానం ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడా ట్వీట్, రకుల్ రిప్లయ్ నెట్టింట హాట్ గా మారాయి. "కారులో సెషన్ అనంతరం ఆమె తన ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది" అని ఓ యువకుడు రకుల్ ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.

 ఇది రకుల్ దృష్టికి రావడంతో, ఆమె సమాధానం ఇస్తూ, "మీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్లు చాలానే చేసిందేమో... అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్ల వివరాల గురించి ఆమెనే అడుగు. అప్పటివరకూ మహిళలకు రక్షణ ఉండదేమో. కేవలం సమానత్వం, రక్షణ అని చర్చలు సాగిస్తే ఉపయోగం ఉండదు" అని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Rakulpreet Singh
Twitter
Comment
Cheap Comment

More Telugu News